భారతదేశం, మార్చి 21 -- గూగుల్​ పిక్సెల్​ 9ఏ స్మార్ట్​ఫోన్​ ఇటీవలే ఇండియాతో పాటు మొత్తం మీద 32 దేశాల్లో లాంచ్​ అయ్యింది. టెన్సర్ జీ4 చిప్​సెట్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​ ధర కేవలం రూ.49999. హార్డ్​వేర్​ అప్​గ్రేడ్స్​తో పాటు, ఈ స్మార్ట్​ఫోన్​ కొన్ని డిజైన్ అప్​డేట్స్​ని సైతం పొందింది., ఇది సాధారణంగా అందించే వాటికి కొంచెం భిన్నంగా ఉండటంతో గూగుల్ అభిమానుల్లో ప్రజాదరణ పొందుతోంది. అందువల్ల, మీరు ఫ్లాగ్​షిప్​ సామర్థ్యాల ఫీచర్లతో నిండిన, శక్తివంతమైన మిడ్-రేంజర్ కోసం వెతుకుతుంటే, గూగుల్ పిక్సెల్ 9ఏ మీకు సరైన ఆప్షన్​ కావచ్చు. ఈ నేపథ్యంలో స్మార్ట్​ఫోన్ ధర, ఫీచర్స్​, సేల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్ నుంచి వస్తున్న అఫార్డిబుల్​ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ ఈ పిక్సెల్ 9ఏ. అయితే టెక్ దిగ్గజం తన సిగ్నేచర్ కెమెరా బార్​ని తొలగించడం ద్వారా ఈ స్మార...