భారతదేశం, ఫిబ్రవరి 17 -- గూగుల్​ పిక్సెల్​ 9ఏ స్మార్ట్​ఫోన్​ సంస్థ లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గూగుల్​ పిక్సెల్​ 8ఏ ధరను సంస్థ భారీగా తగ్గించింది! ప్రైజ్​ డ్రాప్​తో పాటు వివిధ ఫ్లిప్​కార్ట్​లోని డిస్కౌంట్స్​, ఆఫర్స్​తో ఈ స్మార్ట్​ఫోన్​ని మీరు ఇప్పుడు రూ. 35వేల లోపు ధరకు దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారు.. ఈ బెస్ట్​ డీల్స్​ని ఉపయోగించుకోవాలి. ఈ నేపథ్యంలో గూగుల్​ పిక్సెల్​ 8ఏ డిస్కౌంట్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

గూగుల్​ పిక్సెల్​ 8ఏ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వాస్తవ ధర రూ. 52,999. కానీ 28శాతం ప్రైజ్​ డ్రాప్​తో ఈ స్మార్ట్​ఫోన్​ని ఇప్పుడు రూ. 37,999కే కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ కామర్స్​ డిస్కౌంట్స్​- బ్యాంక్​ ఆఫర్స్​, ఎక్స్​ఛేంజ్​ఆఫర్స్​తో గూగుల్​ పిక్...