భారతదేశం, ఏప్రిల్ 11 -- దిగ్గజ టెక్​ కంపెనీలు మళ్లీ లేఆఫ్స్​ బాట పట్టినట్టు కనిపిస్తోంది! తాజాగా ఈ లిస్ట్​లోకి గూగుల్​ చేరింది. కంపెనీ ఉద్యోగులకు షాక్​ ఇస్తూ.. అనేక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది దిగ్గజ సంస్థ.

ఆండ్రాయిడ్ సాఫ్ట్​వేర్, పిక్సెల్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్​పై పనిచేసే ప్లాట్​పామ్స్​, డివైజెస్ యూనిట్ నుంచి గూగుల్ గురువారం వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్టు ఒక నివేదిక బయటకు వచ్చింది.

"గత సంవత్సరం ప్లాట్​ఫామ్స్​, డివైజెస్ బృందాలను కలిపినప్పటి నుంచి, మేము మరింత చురుకుగా మారడం- మరింత సమర్థవంతంగా పనిచేయడంపై దృష్టి పెట్టాము. జనవరిలో మేము అందించిన స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమానికి అదనంగా కొన్ని ఉద్యోగాల తగ్గింపులు కూడా ఇందులో ఉన్నాయి," అని గూగుల్ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

కాగా ఈ నివేదికలో ఉన్న సమాచారం ప్...