భారతదేశం, సెప్టెంబర్ 19 -- గూగుల్ జెమినీ తీసుకొచ్చిన 'నానో బనానా' ఫీచర్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ టూల్ ఉపయోగించి యూజర్లు చాలా రకాల విజువల్స్ క్రియేట్ చేస్తున్నారు. అచ్చం నిజమైన పోట్రైట్స్ నుంచి ఊహాజనిత చిత్రాల వరకు ఎన్నో రకాల చిత్రాలను ఈ టూల్ సృష్టిస్తోంది. మొదట ఒక ఆసక్తిగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఒక క్రియేటివ్​ వేవ్​గా మారింది. ప్రజలు తమకు ఇష్టమైన ప్రపంచ నాయకులతో కలిసి ఉన్న అద్భుతమైన ఫొటోలను క్రియేట్ చేసి షేర్ చేసుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్​ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టించిన ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ డిజిటల్ సృజనాత్మకతను ఇతరులతో పంచుకుంటున్నారు. మరి మీరు కూడా ప్రంపచ నేతలతో కలిసి మీటింగ్​లో ఉన్నట్టు ఫొటోలు క్రియేట్​ చేసుకోవాలా? అయితే ఇలా చ...