భారతదేశం, సెప్టెంబర్ 27 -- సెర్చ్ దిగ్గజం 'గూగుల్' నేడు (సెప్టెంబర్ 27తో) 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది! ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. అమెరికా మెన్లో పార్క్‌లోని ఒక చిన్న గ్యారేజీలో పురుడు పోసుకున్న ఒక ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్‌గా మారింది.

ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ గూగుల్‌ను ఉపయోగిస్తారు. నిజానికి, మీరు ఈ ఆర్టికల్‌ను గూగుల్ ద్వారానే చదవగలుగుతున్నారు! అయితే, 'గూగుల్' అంటే నిజంగా అర్థం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

గూగుల్ అనేది గణితంలో ఉపయోగించే పదం 'గూగోల్' (Googol) పై చేసిన ఒక తెలివైన పద ప్రయోగం. 'గూగోల్' అంటే 1 తర్వాత వంద సున్నాలు ఉన్న సంఖ్యను లేదా 10 పవర్​ 100ను సూచించే గణిత పదం.

ఈ 'గూగోల్' పదాన్ని గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ కాస్నర...