భారతదేశం, మే 4 -- Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 65,740కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 65,750గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,57,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,574గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 71,720కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 71,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,17,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,172గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,890గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,870గా ఉంది. కోల్​కత...