భారతదేశం, మార్చి 25 -- కొన్ని నెలలుగా విపరీతంగా పెరిగిపోయిన బంగారం ధరలు, కొన్ని రోజులుగా దిగొస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 89,635కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 8,96,350గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,963గా ఉంది.

మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 82,165కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 8,21,650కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 8,216గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 82,313గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,783గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం ...