భారతదేశం, జనవరి 29 -- న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగుకు బ్రేకులు పడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మదుపర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ 2.1 శాతం వృద్ధితో 5,511.79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒక దశలో ఇది 5,591.61 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ హైని తాకడం విశేషం.

కేవలం ఈ వారంలోనే బంగారం ధర సుమారు 10 శాతానికి పైగా పెరిగింది. సోమవారం నాడు తొలిసారిగా 5,000 డాలర్ల మార్కును అధిగమించిన పసిడి, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి అంశాలు పసిడికి కలిసివచ్చాయి.

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. స్పాట్ సిల్వర్ 1.3 శాతం పెరిగి ఔన్స...