భారతదేశం, ఆగస్టు 6 -- గేట్​ 2026 కోసం ప్రిపేర్​ అవుతున్న వారికి కీలక అలర్ట్​! గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2026కు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ను (gate2026.iitg.ac.in) ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహ‌తి ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 25, 2025న మొదలవుతుంది. అభ్యర్థులు, ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో కూడిన గడువు అక్టోబర్ 6 వరకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

జాతీయ స్థాయిలో జరిగే ఈ గేట్ ప‌రీక్ష‌ను ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్​సీ), ఐఐటీలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇది విద్య మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగం, నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు (ఎన్​సీబీ) తరపున జరుగుతుంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ వం...