భారతదేశం, మార్చి 5 -- మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం అంచనాలకు తగ్గట్టు ఫలితాన్ని అందుకోలేకపోయింది. తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు దక్కించుకోలేకపోయింది. గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, హిందీ వెర్షన్ మరో ప్లాట్‍ఫామ్‍లోకి వస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా హిందీ వెర్షన్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో హిందీ వెర్షన్ అడుగుపెట్టనుంది.

గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్...