భారతదేశం, మార్చి 4 -- Gaami: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గామి సినిమాపై ప్రస్తుతం హైప్ వీపరీతంగా ఉంది. ట్రైలర్ టెక్నికల్‍గా అద్భుతంగా ఉండటంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. దర్శకుడు విద్యాధర్ కగిటకు ఇది డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. మార్చి 8వ తేదీన గామి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో నేడు (మార్చి 4) ఈ చిత్రం నుంచి 'శివమ్' అనే పాట వచ్చేసింది.

గామి చిత్రం నుంచి శివమ్ సాంగ్ నేడు రిలీజ్ అయింది. స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో ఈ పాటను మూవీ టీమ్ తీసుకొచ్చింది. 'నీలోని యుద్ధం శివమ్.. నీతోనీ యుద్ధం శివం' అంటూ ఈ పాట ఇంటెన్సిటీతో ఉంది. ఈ మూవీ థీమ్‍ను తెలిపేలా ఈ సాంగ్ ఉంది.

దిగ్గజ గాయకుడు శంకర్ మహదేవన్.. గామిలోని ఈ శివమ్ పా...