భారతదేశం, మార్చి 26 -- Free gas Scheme: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకంలో మొదటి సిలిండర్‌ బుకింగ్ గడువు మరో ఐదు రోజుల్లో పూర్తి కానుంది. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్‌ ను మార్చి 31 వరకు బుక్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సిలిండర్‌ పొందని వారు వెంటనే గ్యాస్ బుక్ చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్‌ ఇప్పటి పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. మార్చి 26వ తేదీ నాటికి ...