Hyderabad, ఫిబ్రవరి 12 -- First 1 Crore Movie: ఇండియాలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ మూవీస్, ఎవర్ గ్రీన్ మూవీస్ అనగానే అందరికీ షోలే, మొఘల్-ఇ-ఆజం, దంగల్, పుష్ప 2, బాహుబలి 2లాంటి సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే వీటిన్నింటి కంట ముందే ఓ మూవీ దేశంలో అన్ని రికార్డులను తిరగరాసింది. ఎప్పుడో 80 ఏళ్ల కిందటే ఈ మూవీ రూ.కోటి వసూలు చేసి సంచలనం సృష్టించడం విశేషం.

ఇండియాలో రూ.కోటి వసూలు చేసిన తొలి సినిమా పేరు కిస్మత్ (Kismet). జ్ఞాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. 1943లో ఈ సినిమా రిలీజైంది. అశోక్ కుమార్, ముంతాజ్ శాంతి, షా నవాజ్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ అప్పట్లో ఓ బాక్సాఫీస్ సంచలనం. నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోను తొలిసారి పరిచయం చేసిన సినిమా ఇది.

ఈ మూవీలో అశోక్ కుమార్ ఓ జేబు దొంగలా నటించడం విశేషం. ఆ తర్వాత ఇలా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోల సినిమాలు ఇండియాలో చాలానే వచ...