భారతదేశం, ఫిబ్రవరి 18 -- Fire Accident: కృష్ణా జిల్లా గన్నవరంలో ఘోర ప్రమాదం తప్పింది. గోపనపల్లి గ్రామంలో ఉన్న లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో అర్థరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఈ అనాథశ్రమంలో దాదాపు 140మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమం ప్రాంగణంలోనే వారికి పాఠశాలను నిర్వహిస్తున్నారు.

సోమవారం అర్థరాత్రి భవనం రెండో అంతస్తులో ఉన్న బాలల విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చిన్నారులు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఆరుగురు విద్యార్ధులు మాత్రం మంటల్లో చిక్కుకుపోయారు. అగ్నిప్రమాదం సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న బాలల్ని ఫైర్ సిబ్బంది కాపాడారు.

అగ్ని కీలలు వ్యాపించిన సమయంలో గదిలో చిక్కుకుపోయిన చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై పలు అనుమాన...