భారతదేశం, ఏప్రిల్ 1 -- Explosion at firecracker factory: గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో 13 మంది మృతి చెందారు. దీసా పట్టణానికి సమీపంలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురికి గాయాలు కాగా వారి పరిస్థితి నిలకడగా ఉంది.

ఉదయం 9:45 గంటలకు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని, ఈ పేలుడు ధాటికి ఆర్సీసీ స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయిందని, దాంతో ఆ శిధిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారని, బనస్కాంత కలెక్టర్ మిహిర్ పటేల్ తెలిపారు. ''ఫ్యాక్టరీ శిథిలాల నుంచి ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశారు. ఆర్సీసీ స్లాబ్ మొత్తం కూలిపోయింది. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి'' అని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుత...