భారతదేశం, మార్చి 23 -- దేశంలో ఐటీ హబ్​గా పేరొందింది బెంగళూరు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి అనేక మంది ఉద్యోగం కోసం వస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో బెంగళూరు ట్రాఫిక్​, లివింగ్​ ఎక్స్​పెన్సెస్​ గురించి వార్తలు వైరల్​ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి.. పూణె నుంచి 40శాతం పే- హైక్​తో రూ. 25లక్షల ప్యాకేజ్​తో బెంగళూరుకు వెళ్లాడు. కానీ ఏడాది తిరగకుండానే, బెంగళూరుకు వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని ఫీల్​ అవుతున్నాడు. అసలేం జరిగిందంటే..

బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న స్థిరాస్తి ధరలు కొత్తవారికి ప్రధాన ఆందోళనగా మారుతున్నాయి. నగరంలో ఉంటే తమ ఆర్థిక పరిస్థితి మెరుగైన జీవన నాణ్యతకు దోహదం చేస్తాయా? అని చాలా మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

పుణెలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి 40% వేతన పెంపు కోసం బెంగళ...