Hyderabad, జనవరి 2 -- ETV Win OTT January Releases: ఓటీటీలోకి కొత్త ఏడాది కొత్త సినిమాలు ఎన్నో రాబోతున్నాయి. అయితే ముందుగా జనవరిలో నెలలో రానున్న సినిమాల గురించి చూద్దాం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన ఈటీవీ విన్ ఓటీటీ సంక్రాంతి బొనాంజా అందిస్తున్నామంటూ.. తాము స్ట్రీమింగ్ చేయబోతున్న సినిమాల గురించి వెల్లడించింది. వీటి స్ట్రీమింగ్ తేదీలను చెప్పకపోయినా.. మొత్తంగా జనవరిలో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ చేయనున్నట్లు మాత్రం తెలిపింది. పోతుగడ్డ, వైఫ్ ఆఫ్, బ్రేకౌట్, మిన్‌మినీ సినిమాల పోస్టర్లను రిలీజ్ చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జనవరి 2) తమ ఎక్స్ అకౌంట్ ద్వారా పొంగల్ బొనాంజా గురించి వెల్లడించింది. "ఈ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ తో పొంగల్ ను సెలబ్రేట్ చేసుకోండి. ఈ జనవరిలో ఈటీవీ విన్ లోకి వస్తున్న ఈ ఎక్సైటింగ్ మూవీస్ చూడండి" అ...