భారతదేశం, ఫిబ్రవరి 28 -- EPFO interest rate: ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2024-25 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ బోర్డు శుక్రవారం నిర్ణయించింది. 2024 ఫిబ్రవరిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ వడ్డీ రేటును 2023-24 సంవత్సరానికి స్వల్పంగా పెంచి, 8.25 శాతంగా నిర్ణయించింది. ఇదే వడ్డీ రేటును యథాతథంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగిస్తున్నట్లు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2022-23లో 8.15 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతానికి స్వల్పంగా పెంచింది. మార్చి 2022 లో, ఇపిఎఫ్ఓ తన ఏడు కోట్లకు పైగా చందాదారులకు 2021-22 సంవత్సరానికి ఇపిఎఫ్ పై వడ్డీని 2020-21 లో గరిష్టంగా ఉన్న 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించిం...