భారతదేశం, ఏప్రిల్ 4 -- ఓలా ఎలక్ట్రిక్​కి సంబంధించి ఒక బిగ్​ అప్డేట్​ మార్కెట్​లోకి వచ్చింది! ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని విడా, టీవీఎస్ మోటార్ కంపెనీ, హోండా వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ సంస్థ.. భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్​లో ఎక్కువ భాగాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా, ఈ ఈవీ స్టార్టప్ తన అమ్మకాల పరిమాణం, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడల్స్​ని తీసుకొస్తోంది. ఇవి 2026 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం తర్వాత విడుదల అవుతాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల శ్రేణిని విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ దేశంలో కనీసం ఆరు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ రాబోయే ఎలక్...