భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో చాలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఆప్షన్స్​ అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో కైనెటిక్​ ఎనర్జీకి చెందిన 'జింగ్' ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఒకటి! సిటీ డ్రైవ్​కి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఈ-స్కూటర్​ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రేంజ్​, ధరతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కైనెటిక్​ జింగ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో అనేక ఫీచర్స్​ ఉన్నాయి. ఇందులో ఎల్​ఈడీ హెడ్​లైట్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్​, ఎల్​ఈడీ టర్న్​ సిగ్నల్​ ల్యాంప్​, లో బ్యాటరీ ఇండికేటర్​ వంటివి ఉన్నాయి. డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, యూఎస్​బీ ఛార్జింగ్​ పోర్ట్​, డిజిటల్​ స్పీడోమీటర్​, సెంట్రల్​ లాకింగ్​ సిస్టెమ్​, అండర్​ స్టోరేజ్​ కెపాసిటీ కూడా ఈ స్కూటర్​ సొంతం.

ఈ ఈ-స్కూటర్​ ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ సస్పెన్షన్స్​, రేర్​లో అడ్జ...