భారతదేశం, ఫిబ్రవరి 1 -- కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మీకోసం మరో ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. అదే.. టీవీఎస్​ ఎక్స్​! ఈ హై- పర్ఫార్మెన్స్​ స్కూటర్​ డెలివరీలను సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీవీఎస్​ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ నిస్సందేహంగా ద్విచక్ర వాహన తయారీదారు నుంచి వస్తున్న సాహసోపేతమైన ఆఫర్! దీని రాడికల్ స్టైలింగ్ హైలైట్​. క్రియోన్ స్కూటర్​ కాన్సెప్ట్ ఆధారంగా వచ్చి ఈ వెహికిిల్​.. షార్ప్ లైన్స్, ప్రీమియం డిజైన్ చాలా వరకు ప్రొడక్షన్ వర్షెన్​ని పోలి ఉంది.

వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని 2023లోనే సంస్థ ప్రదర్శించింది. కానీ 2024 డిసెంబర్​ చివరి నాటికి డెలవరీలను ప్రారంభించింది. దశలవారీగా ఇతర నగరాలకు డెలివరీలను విస్తరించాలని కంపెనీ యో...