భారతదేశం, మార్చి 16 -- బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ని లాంచ్​ చేసేందుకు ప్లాన్​ చేస్తోంది. ఇది ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతున్న చేతక్​ ఈ-స్కూటర్​ కన్నా తక్కువ ధర ఉంటుందని సమాచారం. కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ మ్యూల్ ఇప్పటికే పబ్లిక్ రోడ్లపై చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు గత కొంతకాలంగా సరసమైన ప్రయాణికుల విభాగంలో తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీతో పాటు మరికొన్ని ఇప్పటికే ఈ వ్యూహాన్ని అనుసరించాయి. బజాజ్ ఆటో ఒక ప్రధాన ద్విచక్ర వాహన బ్రాండ్. పెరుగుతున్న కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేస్​లో మార్కెట్​ షేరును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ వ్యూహంలో భాగంగా ...