భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా పేరు తెచ్చుకుంది ఏథర్​ రిజ్టా. సింగిల్​ ఛార్జ్​తో దాదాపు 160 కి.మీ రేంజ్​ని ఈ ఈ-స్కూటర్​ ఇస్తుంది. ఇక ఇప్పుడు 'ఫిబ్రవరి ఫ్యామిలీ ట్రీట్​' పేరుతో ఈ మోడల్​పై ఏథర్​ ఎనర్జీ సంస్థ డిస్కౌంట్ల్​ను ఇస్తోంది. మీరు ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తుంటే, ఇదే సరైన సమయం! ఈ నేపథ్యంలో ఏథర్​ రిజ్టా ధరల తగ్గింపు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఏథర్ ఎనర్జీ రిజ్టా ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్​పై రూ .15,000 కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. స్కూటర్​పై అందించే డిస్కౌంట్లు, ప్రయోజనాల కలయిక భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో మారుతుంది.

గుజరాత్​లో ఈవీ తయారీ సంస్థ రూ.10,000 క్యాష్ బెనిఫిట్​తో పాటు క్...