భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు ఉన్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సెగ్మెంట్​లో దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ చాలా ఆలస్యంగా అడుగుపెడుతోంది. మారుతీ సుజుకీ ఈ విటారను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి మరొ ఎగ్జైటింగ్​ అప్డేట్​ వచ్చింది. ప్రస్తుతానికి వెనకపడినా, భవిష్యత్తులో దేశ ఈవీ రంగంలో ప్రత్యేక ముద్రవేసేందుకు భారీ ప్లాన్సే వేసింది మారుతీ సుజుకీ. ఇందులో భాగంగానే 2030 నాటికి ఈవీ లీడర్​గా ఆవిర్భవించాలని చూస్తోంది. ఇందుకోసం ఎఫ్​వై30 నాటికి కనీసం 4 ఎలక్ట్రిక్​ కార్లను లాంచ్​ చేయాలని భావిస్తోంది. 2025-2030 ఆర్థిక సంవత్సరానికి తన ఉత్పత్తి వ్యూహం, మిడ్ టర్మ్ మేనేజ్మెంట్ ప్రణాళికను వెల్లడిస్తూ.. నాలుగు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ ధృవీ...