భారతదేశం, మార్చి 23 -- ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు కనిపిస్తున్న డిమాండ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. అయితే, రానున్న రోజుల్లో లాంచ్​కానున్న 3 మోడల్స్​పై ఇండియాలో మంచి బజ్​ ఉంది. అవి.. మారుతీ సుజుకీ ఈ విటారా, ఎంజీ ఎం9 ఎంపీవీ, ఎంజీ సైబర్​స్టర్​. రాబోయే కొన్ని వారాల్లో భారతదేశంలో లాంచ్ అవుతున్న ఈ మోడల్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

భారతదేశంలో త్వరలో విడుదల కానున్న అత్యంత ఎగ్జైటింగ్​ కార్లలో మారుతీ సుజుకీ ఈ విటారా ఒకటి. ఇది బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. మారుతీ సుజుకీ ఇప్పటికే ఈ విటారాను 2025 ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది. ఈ ఎస్​యూవీపై గత కొంత కాలంగా రోడ్ టెస్ట్​లు జరుగుతున్నాయి. ఇది త్వరలో ఇండియాలో లాంచ్ అవుతు...