భారతదేశం, ఏప్రిల్ 8 -- మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్​ కారు ఈ- విటారా కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి! 2025 ఆటో ఎక్స్​పోలో సంస్థ ప్రదర్శించిన ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లాంచ్​పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఈ నెల చివరిలో లేదా 2025 మేలో లాంచ్​ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

లాంచ్ అయిన తర్వాత మారుతీ సుజుకీ ఈ విటారా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా నెక్సాన్ ఈవీ వంటి కొన్ని బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​తో పోటీపడుతుంది. మారుతీ సుజుకీ ఈ విటారాను ఓఈఎం ప్రీమియం రిటైల్ నెట్​వర్క్ నెక్సా ద్వారా విక్రయించనున్నట్లు కార్ల తయారీ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్​ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు- డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, లెవల్ 2 ఏడీఏఎస్, ఫుల్లీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, మరికొన్ని హై-ఎ...