భారతదేశం, ఏప్రిల్ 13 -- మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల బిఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీల డెలివరీలను ప్రారంభించింది. వాహన తయారీదారు గత కొన్ని రోజుల్లో 3,000 వాహనాలను వినియోగదారులకు అందజేసింది. కానీ ఈ మోడల్స్​కి వస్తున్న డిమాండ్​కి ఇది సరిపోలేదు. ఫలితంగా ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్ల వెయిటింగ్​ పీరియడ్​ అమాంతం పెరిగిపోయింది.

ఎక్స్​ఈవీ 9ఈ, బీఈ 6కి 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ఈ విషయాన్ని సంస్థ కూడా ధ్రువీకరించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్​గా మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ (59 శాతం) నిలిచింది. బీఈ 6కి 41 శాతం డిమాండ్​ కనిపించింది మహీంద్రా తెలిపింది. ఇంకా, చాలా మంది వినియోగదారులు టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్​ని ఎంచుకుంటున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీల డెలివరీలను పెంచే పనిలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. రూ.8,472 కో...