భారతదేశం, ఏప్రిల్ 15 -- మచ్​ అవైటెడ్​ ఓలా ఎలక్ట్రిక్​ తొలి బైక్​పై కీలక అప్డేట్​! ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ బైక్​ డీలర్​షిప్​ షోరూమ్స్​కి చేరుకోవడం ప్రారంభించింది. కాబట్టి, బ్రాండ్ త్వరలోనే ఈ-బైక్​ డెలివరీలను ప్రారంభిస్తుందని అంచనాలు మొదలయ్యాయి. రోడ్​స్టర్ ఎక్స్ ఉత్పత్తిని ఇటీవల ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ మూడు ప్రత్యేకమైన వేరియంట్లలో లభిస్తుంది. ప్రతి ఒక్కటి వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తుంది. ఓలా రోడ్​స్టర్ ఎక్స్ బ్యాటరీ కాన్ఫిగరేషన్లు 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్లు. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్​తో సంబంధం లేకుండా, అన్ని వేరియంట్లు ఒకే 7 కిలోవాట్ల మిడ్-మౌంటెడ్ మోటార్​తో పనిచేస్తాయి.

ఓలా రోడ్​...