భారతదేశం, ఏప్రిల్ 8 -- తన పోర్ట్​ఫోలియోలోని బెస్ట్​ సెల్లింగ్​ రేంజర్​ ఎలక్ట్రిక్​ క్రూయిజర్ బైక్​కి​ అప్డేటెడ్​ వర్షెన్స్​ని తీసుకొచ్చింది కొమాకి ఎలక్ట్రిక్​. అప్డేటెడ్​ కొమాకి రేంజర్ క్రూయిజర్ మోటార్ సైకిల్ అనేది రేంజర్ - బేస్ మోడల్, రేంజ్ - ఫుల్లీ లోడెడ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా రూ .1.40 లక్షలు, రూ .1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​ నుంచి ఈ బైక్​ని బుక్ చేసుకోవచ్చు. కొత్త కొమాకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్​ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఈ-బైక్​ విశేషాలను ఇక్కడ చూసేయండి.

కొత్త శ్రేణి కొమాకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్​ నెక్ట్స్​ జనరేషన్ లిఫెపో బ్యాటరీ ప్యాక్​తో పనిచేస్తుందని ఈవీ తయారీదారు వెల్లడ...