భారతదేశం, ఫిబ్రవరి 21 -- భారతదేశ విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టాన్ని (FEMA) ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) ఇండియాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) రూ. 3.44 కోట్ల జరిమానా విధించింది. బీబీసీ ఇండియా డైరెక్టర్లపై కూడా జరిమానా విధించింది. డిజిటల్ మీడియా సంస్థలపై 26% పరిమితి ఉన్నప్పటికీ విదేశీ నిధులను తగ్గించలేదన్న ఆరోపణలపై ఈడీ ఈ చర్య తీసుకుంది.

బీబీసీ ఇండియాకు రూ.3.44 కోట్లకు పైగా జరిమానాతో పాటు 2021 అక్టోబర్ 15 తర్వాత నుంచి ప్రతిరోజూ రూ.5,000 చొప్పున లెక్కకట్టి జరిమానాగా చెల్లించాలని ఈడీ ఆదేశించింది. ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) 1999 నిబంధనలను ఉల్లంఘించినందుకు బీబీసీ ఇండియాకు రూ.3,44,48,850 జరిమానాతో పాటు 15.10.2021 తర్వాత ప్రతిరోజూ రూ.5000 చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ...