భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఖగోళ ప్రియులకు ఈ ఆదివారం ఒక పండుగ లాంటిది! భారత్​తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కనిపించనున్న అద్భుతమైన ఖగోళ దృశ్యం - సంపూర్ణ చంద్రగ్రహణం. దీనినే మనం "బ్లడ్ మూన్" అని కూడా పిలుస్తాము. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటంతో అది ఎర్రటి రంగులోకి మారుతుంది. ఈ "బ్లడ్ మూన్" దృశ్యం శతాబ్దాలుగా మానవాళిని ఆకర్షిస్తోంది. కొన్నిసార్లు భయపెట్టింది కూడా!

భారతదేశం, చైనాతో పాటు ఆసియాలో ఈ చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు. అలాగే తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆస్ట్రేలియాలో కూడా సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో చంద్రోదయం సమయంలో పాక్షిక గ్రహణం మాత్రమే కనబడుతుంది. ఇక అమెరికా ఖండాల్లోని ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని అసలు చూడలేరు.

ఈ "బ్ల...