భారతదేశం, ఫిబ్రవరి 17 -- దిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5:36 గంటలకు భూమికి 5 కిలోమీటర్ల లోతులో, రిక్టార్​ స్కేల్​పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

దిల్లీ, నోయిడా, ఇందిరాపురం, ఇతర ఎన్​సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా చోట్ల నిద్రలో ఉన్న ప్రజలు భూకంపం ధాటికి హఠాత్తుగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆ వెంటనే సోషల్ మీడియాలో దిల్లీ భూకంపంపై ట్వీట్లు వెల్లువెత్తాయి. భయానక ప్రకంపనలు అనుభవించామని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....