భారతదేశం, ఫిబ్రవరి 23 -- Credit card tips to earn money : క్రెడిట్​ కార్డు బిల్లులు కట్టలేక అలసిపోతున్నారా? 'ఈ క్రెడిట్​ కార్డును అనవసరంగా తీసుకున్నాను రా బాబు..' అని ఫీల్​ అవుతున్నారా? క్రెడిట్​ కార్డులతో ఖర్చు చేయడమే కాకుండా.. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? అవును. నిజం! క్రెడిట్​ కార్డులతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని టిప్స్​ పాటించాలి. అవేంటంటే..

బ్యాంక్​లు.. క్రెడిట్​ కార్డులు ఇస్తాయి. వాటి మీద 30-45 రోజుల వరకు ఇంట్రెస్ట్​ ఫ్రీ లోన్​లు ఇస్తాయి. క్రెడిట్​ కార్డు వాడి.. మీరు ఎన్ని ఖర్చులు చేసినా, వాటిపై డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నెల చివర్లో స్టేట్​మెంట్​ జనరేట్​ అవుతుంది. అక్కడి నుంచి 1- 2 వారాలకు క్రెడిట్​ కార్డు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లోపు కట్టేస్తే.. మీ నుంచి బ్యాంక్​ ఎలాంటి డబ్బు...