భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో ఓ తల్లీకూతుళ్లు శవమైన కనిపించారు. వారి గొంతులు కోసేసి ఉన్నాయి. నిందితులు ఇంకా పోలీసులకు చిక్కకపోవడం ఆందోళనకర విషయం! ఈ హత్యకు పాల్పడింది ఒకరేనా? లేక ఇందులో ఎంత మంది హస్తం ఉంది? అన్నది ప్రస్తుతం ఎవరికీ తెలియదు.

ఉత్తర్​ప్రదేశ్​లోని మలహాబాద్​ పట్టణం సమీపంలో ఉన్న ఇషాపూర్​ అనే గ్రామంలో గురువారం మధ్యహ్నం ఈ డబుల్​ మర్డర్​ వ్యవహారం బయటపడింది. గీత, ఆమె కూతురు దీపికలు ఆ ఇంట్లో నివాసముంటున్నారు. ఆమె భర్త ప్రకాశ్​, ఉద్యోగం పని మీద కొంతకాలం క్రితం ముంబై వెళ్లాడు. గీత కుమారుడు దేవాన్ష్​, తన తాత సిద్ధాంత్​ ఇంటికి వెళ్లాడు.

కాగా తల్లితో మాట్లాడాలని బుధవారం రాత్రి గీతకు దేవాన్ష్​ ఫోన్​ చేశాడు. కానీ ఎవరూ ఫోన్​ లిఫ్ట్​ చేయలేదు. పదేపదే కాల్​ చేసినా లాభం లేకుండా పోయింది....