భారతదేశం, ఫిబ్రవరి 7 -- అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్​ ట్రంప్​ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై టారీఫ్​లు విధిస్తు బెంబేలెత్తిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్​ క్రిమినల్​ కోర్టును సైతం విడిచిపెట్టలేదు! తన మిత్రదేశం ఇజ్రాయెల్​పై "చట్టవిరుద్ధమైన, నిరాధారమైన" దర్యాప్తు చేశారంటూ ఐసీసీపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్ల మీద సంతకం చేశారు.

అమెరికాకి గానీ, ఇజ్రాయెల్​కి గానీ అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యత్వం లేదా గుర్తింపు పొందలేదు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్​ పర్యటన నేపథ్యంలో ట్రంప్ ఈ చర్య చేపట్టడం గమనార్హం. ఆయన, ట్రంప్ మంగళవారం వైట్​హైస్​లో చర్చలు జరిపారు. నెతన్యాహు గురువారం క్యాపిటల్ హిల్​లో చట్టసభ సభ్యులతో వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

2023 అక్టోబర్​ల...