భారతదేశం, డిసెంబర్ 3 -- ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావడానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం.

ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16, మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026 జనవరి 14, అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11కు ప్రారంభమవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది.

ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుం...