భారతదేశం, మార్చి 22 -- Delimitation: డీలిమిటేషన్ పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పారదర్శకత, స్పష్టత కొరవడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) శనివారం ఈ అంశంపై తీర్మానం చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేసిన జేఏసీ 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల ఏర్పాటును వచ్చే 25 ఏళ్ల పాటు పొడిగించాలని కోరింది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా పారదర్శకంగా జరగాలని, అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య రాజకీయ పార్టీలు చర్చించడానికి, సహకరించడానికి వీలు కల్పించాలని జేఏసీ ఆమోదించిన తీర్మానం పేర్కొంది. 42, 84, 87వ రాజ్యాంగ సవరణల వెనుక ఉన్న శాసన ఉద్దేశం జనాభా నియంత్రణ చర్యలను సమర్థవంతంగా...