భారతదేశం, ఫిబ్రవరి 16 -- మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వస్తున్న వార్తలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రైళ్లు ఆలస్యమవ్వడంతో మొదలైన గందరగోళం.. చివరికి తొక్కిసలాటకు దారితీయగా, ఈ ఘటనలో 18మంది మరణించారు. అయితే, ఒకటి కాదు.. రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.

మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు ప్రయాణికులు శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్​కి చేరుకున్నారు. అయితే ప్రయాగ్​రాజ్​కు వెళ్లాల్సిన రైళ్లు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో అప్పటికే స్టేషన్​లో ఉన్న స్వతంత్ర సేనానీ ఎక్స్​ప్రెస్​- భువనేశ్వర్​ రాజధాని (ఇవి కూడా ప్రయాగ్​రాజ్​కు వెళతాయి) రైలు బయలుదేరడం ఆలస్యమైంది. ఫలితంగా ...