భారతదేశం, ఫిబ్రవరి 12 -- నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ విడుదలై నేటికి (ఫిబ్రవరి 12) సరిగ్గా నెలైంది. ఈ యాక్షన్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహరాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సూపర్ హిట్ అయింది. అయితే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యమవుతోంది. ఎందుకిలా అవుతుందో తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది.

డాకు మహారాజ్ చిత్రం థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ ముందుగా అంచనాలు వెలువడ్డాయి. దీన్నిబట్టి ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్‍కు రానుందంటూ సమాచారం చక్కర్లు కొట్టింది. అయితే, ఆరోజున డాకు మహారాజ్ ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. స్ట్రీమింగ్ ఆలస్యమయ్యేందుకు ఓ...