భారతదేశం, మార్చి 7 -- కరవు భత్యం (డియర్​నెస్​ అలొవెన్స్​), డియర్​నెస్​ రిలీఫ్​ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. 2025 హోలీ సమీపిస్తున్న వేళ, దాని కన్నా ముందే డీఏ పెంపుపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఈసారి డీఏ 2శాతం వరకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరలతో పోరాడేందుకు సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు (జనవరి, జులై) కరవు భత్యం పెరుగుతుంది. అయితే జనవరిలో పెరగాల్సిన డీఏ గురించి సాధారణంగా మార్చ్​లో, జులైలో పెరగాల్సిన దాని గురించి దీపావళి సమయంలో కేంద్రం ప్రకటనలు చేస్తూ ఉంటుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు చేసినా, అది జనవరి, జులై నుంచి కలుపుకునే ఉద్యోగుల జీతాల్లో పడుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి 2025 హోలీ సమయంలో డీఏ పెంపుపై ప్రకటన వచ్చే అవక...