భారతదేశం, జూన్ 30 -- సీయూఈటీ యూజీ 2025 ఫలితాల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న వేళ ఎన్టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ)పై లక్షలాది మంది అభ్యర్థుల్లో అసహనం వెల్లువెత్తుతోంది. ఫలితాలు ఇంకా ఎందుకు విడుదల చేయలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, ఎన్టీఏ విశ్వసనీయతపై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీఏని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

250కుపైగా కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్​ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పరీక్ష ఈ సీయూఈటీ యూజీ (కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ ఫర్​ అండర్​గ్రాడ్యుయేట్స్​). ఈ ఏడాది మే 15 నుంచి 18 మధ్యలో 13.48లక్షల మంది ఈ పరీక్ష రాశారు. కానీ ఇప్పటికీ ఫలితాలు వెలువడలేదు. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీయూఈటీ యూజీ ఫలితాలు ఆలస్యమవ్వడం వల్ల ఎన్టీఏపై అటు విద్యార్థులు...