భారతదేశం, మార్చి 26 -- CUET UG 2024: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది., నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, ఎన్టీఏ 2024 మార్చి 26 వరకు రిజిస్ట్రేషన్లను అనుమతించనుంది.

సీయూఈటీ యూజీ (Common University Entrance Test 2024) 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారంతో ముగించనుంది. Under Graduate అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు https://cuetug.ntaonline.in/ ఎన్ టీఏ సీయూఈటీ 2024 అధికారిక వెబ్ సైట్ లో డైరెక్ట్ లింక్ ను చెక్ చేసుకోవచ్చు.

కరెక్షన్ విండో మార్చి 28న ప్రారంభమై 2024 మార్చి 29న ముగుస్తుంది. 2024 ఏప్రిల్ 30న పరీక్షల నిర్వహణ తేదీని ప్రకటించనున్నారు.

సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డును 2024 మే రెండో వార...