భారతదేశం, మార్చి 22 -- సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డు 2025ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. మార్చ్​ 26 నుంచి ఏప్రిల్ 1, 2025 వరకు జరిగే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ అడ్మిట్ కార్డును exams.ntaonline.in/CUET-PG/ ఎన్టీఏ సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

2025 మార్చ్​ 26 నుంచి 30 వరకు, 2025 ఏప్రిల్ 1 మధ్య జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్ కార్డులు వెబ్సైట్​లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫామ్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి సంబంధిత వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డులో సూచించిన పరీక్షా కేంద్రంలో రిపోర్టింగ్ సమయం, గేట్ క్లోజింగ్ సమయం, పరీక్ష తేదీ, షిఫ్ట్, పరీక్షా సమయాలు, పరీక్ష వేదికను చెక్​ చేసుకోండి.

సీయూఈటీ పీజీ అడ్మిట...