భారతదేశం, ఏప్రిల్ 15 -- వరలక్ష్మి శరత్ కుమార్, ఆనంది ప్రధాన పాత్రల్లో 'శివంగి: లయనెస్' చిత్రం రూపొందింది. ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఆశించిన రేంజ్‍లో కలెక్షన్లను దక్కలేదు. శివంగి సినిమా ఓటీటీలోకి తెలుగు కంటే ముందు తమిళ డబ్బింగ్ వెర్షన్ రానుంది. ఈ మూవీ తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది.

శివంగి చిత్రానికి దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించారు. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ ఎప్పుడు రానుందంటే..

శివంగి చిత్రం తమిళ వెర్షన్ ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని ఆ ఓటీటీ ప్రకటించింది. "ఇది థ్రిల్లర్ టైమ్. శివంగి ది లయనెస్ చిత్రం ఏప్రిల్ 18న రానుంది" అని ఆహా తమిళ్ నేడు (ఏప్రిల్ 15) సోషల్ మీడియాలో ...