భారతదేశం, మార్చి 7 -- యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మైనర్​ని అతని స్నేహితులు కిడ్నాప్​ చేశారు. రూ. 10లక్షలు ఇస్తే విడిచిపెడతామని మైనర్​ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. చివరికి, ఆ బాలుడిని అతని స్నేహితులు దారుణంగా కొట్టి చంపేశారు.

యూపీలోని మకాన్​పూర్​ అనే గ్రామంలో బుధవారం జరగింది ఈ ఘటన. బాధితుడి వయస్సు 13ఏళ్లు. అతని తండ్రి ఒక ప్రాపర్టీ డీలర్​. కాగా బాలుడికి 14ఏళ్ల వయస్సున్న నలుగురు స్నేహితులు ఉన్నారు. డబ్బు కావాల్సి వచ్చి.. మైనర్​ని కిడ్నాప్​ చేద్దామని వారు నిర్ణయించుకున్నారు.

సోషల్​ మీడియాలో పలు వీడియోలు చూసి బుధవారం 13ఏళ్ల మైనర్​ని కిడ్నాప్​ చేశారు.

రాత్రి అయినా కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అతని తండ్రి పరిసర ప్రాంతాల్లో వెతికాడు. ఇతర స్నేహితులను కలిసి, తన కుమారుడి వివరాలు అడిగాడు. ...