భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఆమె అక్క భర్త కన్నేశాడు! చివరికి, ఇతరులతో కలిసి ఆమెను రేప్​ చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.

యూపీలోని బుధానా అనే ప్రాంతంలోని బవానా అనే గ్రామంలో జరిగింది ఈ ఘటన. 21ఏళ్ల మహిళ కనిపించడం లేదని.. జనవరి 23న ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని షాకింగ్​ విషయాలు తెలిశాయి.

పోలీసుల కథనం ప్రకారం.. అదృశ్యమైన మహిళకు ఒక అక్క ఉంది. ఆమె భర్త పేరు ఆశిష్​. ఇతను.. తన భార్య సోదరిపై కన్నేసాడు. తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడేవాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు.

ఈ క్రమంలోనే ఆశిష్​, తన సహచరులతో కలిసి ఓ రోజు ఆ 21ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లాడు. పని మీద బయటకు వెళ్లాలని ఆమ...