భారతదేశం, మార్చి 25 -- యూపీలో సౌరభ్​ రాజ్​పుట్​ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని రోజులకే, అదే తరహాలో, అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ, ప్రియుడితో కలిసి తన భర్తను చంపేందుకు ప్లాన్​ చేసింది. చివరికి, కాంట్రాక్ట్​ కిల్లర్​ చేత భర్తను హత్య చేయించింది. పెళ్లైన 15 రోజులలోపే ఇదంతా జరగడం గమనార్హం.

యూపీ ఔరాయాలో జరిగింది ఈ ఘటన. 25ఏళ్ల దిలీప్​ యాదవ్​కి ఇటీవలే వివాహం జరిగింది. అతని భార్య పేరు ప్రగతి యాదవ్​. ఆమె వయస్సు 22ఏళ్లు. కాగా ప్రగతి యాదవ్​కి పెళ్లికి ముందే ఒక లవర్​ ఉన్నాడు. అతని పేరు అనురాగ్​ అలియాస్​ మనోజ్​.

లవర్​ కోసం భర్తను చంపాలని ప్రగతి భావించింది. ఇద్దరు కలిసి ఒక ప్లాన్​ వేశారు. ఇందులో భాగంగానే దిలీప్​ని చంపాలని రామ్​జీ చౌదరీ అనే కాంట్రాక్ట్​ కిల్లర్​కి రూ. 2లక్షలు ఇచ్చారు.

మార్చ్​ 19న దిలీప్​పై...