భారతదేశం, మార్చి 3 -- మహరాష్ట్రలో జరిగిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటి రూపాయల ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ కోసం ఓ వ్యక్తిని ఆయన భార్య, కుమారుడు ప్లాన్​ చేసి చంపేశారు! అనంతరం ఆ హత్యని యాక్సిడెంట్​గా చిత్రీకరించారు. వీరికి మరో వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

సాంగ్లీలో కవతే మహంకాళ్​​లోని షిర్దోన్​కు చెందిన వనితా బాబూరావు పాటిల్, ఆమె కుమారుడు తేజస్ బాబూరావు పాటిల్, అతని స్నేహితుడు భీమ్​రావ్ గణపతిరావు హుల్వాన్​లను పోలీసులు మార్చ్​ 1న అరెస్టు చేశారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు బాబూరావు పాటిల్ (56)ను ఆత్మహత్య చేసుకోవాలని సోషల్ మీడియా ఎక్స్​పర్ట్​ తేజస్, అతని తల్లి ఒత్తిడి తెచ్చారు. అతను సంకోచించడంతో వారు అతన్ని చంపారు.

ఫిబ్రవరి 10న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య లండేవాడి సమీపంలోని మిరాజ...