భారతదేశం, జనవరి 31 -- అసోంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పొరుగింట్లో నివాసముండే మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది! తన పిల్లల ముందే ఆ మహిళను రేప్​ చేశాడని, అనంతరం యాసిడ్​ తరహా రసాయనాన్ని పోసి పారిపోయాడని బాధితురాలి భర్త కేసు వేశాడు.

అసోం సిల్చార్​లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త ప్రకారం.. నిందితుడు ఒక డ్రైవర్​. జనవరి 21న నిందితుడు, తన పొరుగింటిలో ఉండే ఓ మహిళను రోడ్డు మీద అడ్డుకున్నాడు. ఫోన్​ నెంబర్​ ఇవ్వమని బెదిరించాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోకుండా, అక్కడి నుంచి వెళ్లిపోయింది. జనవరి 22న నిందితుడు ఆ మహిళ ఇంట్లోకి దూసుకెళ్లాడు. బలవంతం చేసి ఆమెను రేప్​ చేశాడు. ఆమె ఇద్దరు పిల్లల ముందే, మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యాసిడ్​ తరహా రసాయనాన్ని పోసి పరారయ్యాడు.

ఆ సమయంలో ఆ ఇంట్లో మహిళ భర్త లేడు. కొన్ని గంటల తర్వ...