భారతదేశం, మార్చి 8 -- కర్ణాటకలోని హంపి సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 27ఏళ్ల ఇజ్రాయెల్ టూరిస్ట్​తో పాటు స్థానిక హోమ్ స్టే నడుపుతున్న 29ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఇద్దరు మహిళలు భోజనం తర్వాత ముగ్గురు పురుష పర్యాటకులతో కలిసి సనాపూర్ సరస్సు వద్ద సమయం గడుపుతున్న వేళ ఈ షాకింగ్ సంఘటన జరిగింది.

మీడియా కథనాల ప్రకారం బెంగళూరుకు 350 కి.మీల దూరంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బృందంలో ఒక అమెరికన్ పర్యాటకుడు, ఒడిశా- మహారాష్ట్రకు చెందిన ఇద్దరు భారతీయులు ఉన్నారు. వారు సంగీతం వింటూ, రాత్రిపూట ఆకాశాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్స్​పై వచ్చి తొలుత పెట్రోల్ కావాలని కోరారు. అనంతరం సమీపంలోని ఫ్యూయెల్​ స్టేషన్​ గురించి ఆరా తీశారు. చుట్టుపక్కల ఎవరూ లేరని తెలియడంతో రూ.100 డిమాండ్ చేశారు. అందుకు నిరా...